రాగి లడ్డు

ABN , First Publish Date - 2019-06-22T17:57:50+05:30 IST

రాగిపిండి - ఒకకప్పు, నువ్వులు - అరకప్పు, యాలకులు - నాలుగు, వేరుశెనగలు - పావుకప్పు, బెల్లం

రాగి లడ్డు

కావలసినవి
 
రాగిపిండి - ఒకకప్పు, నువ్వులు - అరకప్పు, యాలకులు - నాలుగు, వేరుశెనగలు - పావుకప్పు, బెల్లం - 150గ్రాములు, ఎండుకొబ్బరి - పావుకప్పు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్‌లు.
 
తయారీవిధానం
 
ఒకటేబుల్‌స్పూన్‌ నెయ్యి వేసి రాగిపిండిని చిన్న మంటపై వేయించి పక్కన పెట్టుకోవాలి.
వేరుశెనగలను వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టాలి. నువ్వులను వేయించుకోవాలి.
వేరుశెనగలు, నువ్వులు, ఎండుకొబ్బరిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో రాగిపిండి, బెల్లం, వేరుశెనగ, నువ్వులు, ఎండుకొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి మిశ్రమాన్ని వేయించాలి. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలుగా చేసుకోవాలి. లడ్డూలు బాగా రావడం కోసం అవసరమైతే మరింత నెయ్యి వేసుకోవచ్చు.

Updated Date - 2019-06-22T17:57:50+05:30 IST