స్వీట్‌ రాగి మాల్ట్‌

ABN , First Publish Date - 2019-06-22T18:02:50+05:30 IST

రాగి పిండి - పావుకప్పు, పంచదార - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, నీళ్లు - ఒకటిన్నర కప్పు, పాలు

స్వీట్‌ రాగి మాల్ట్‌

కావలసినవి
 
రాగి పిండి - పావుకప్పు, పంచదార - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, నీళ్లు - ఒకటిన్నర కప్పు, పాలు - ఒకకప్పు, నెయ్యి - ఒక స్పూన్‌, యాలకుల పొడి - పావుస్పూన్‌, బాదం, జీడిపప్పు పలుకులు - కొన్ని.
 
తయారీవిధానం
 
ఒక పాన్‌లో రాగి పిండి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరొకపాత్రలో నీళ్లు పోసి, కాస్త వేడి అయ్యాక పిండి వేసి ఉడికించాలి. కాసేపయ్యాక రాగి మాల్ట్‌ చిక్కగా అవుతుంది. ఇప్పుడు స్టవ్‌పై నుంచి దింపుకొని పంచదార, పాలు పోసి కలపాలి. నెయ్యి వేయాలి. యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పలుకలు వేసి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-06-22T18:02:50+05:30 IST