చికెన్‌ కార్న్‌ సూప్‌

ABN , First Publish Date - 2019-07-20T21:13:57+05:30 IST

ఒక పాత్రలో మొక్కజొన్న పిండి తీసుకుని, అరకప్పు నీళ్లు పోసి పక్కన పెట్టాలి. మరో పాత్రలో స్వీట్‌ కార్న్‌, చికెన్‌ స్టాక్‌ వేసి ఉడికించాలి.

చికెన్‌ కార్న్‌ సూప్‌

కావలసినవి
 
స్వీట్‌కార్న్‌ - అరకప్పు, చికెన్‌ స్టాక్‌ - నాలుగు కప్పులు, మొక్కజొన్న పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కోడిగుడ్డు - ఒకటి, ఉడికించిన చికెన్‌ ముక్కలు - అరకప్పు, వెనిగర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారీవిధానం
 
ఒక పాత్రలో మొక్కజొన్న పిండి తీసుకుని, అరకప్పు నీళ్లు పోసి పక్కన పెట్టాలి. మరో పాత్రలో స్వీట్‌ కార్న్‌, చికెన్‌ స్టాక్‌ వేసి ఉడికించాలి. నీళ్లు పోసి పెట్టుకున్న మొక్కజొన్న పిండిని అందులో వేయాలి. చిన్నమంటపై పదినిమిషాల పాటు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసి ఉడికించిన చికెన్‌ ముక్కలు వేసి మరికాసేపు ఉంచాలి. కోడిగుడ్డు కొట్టి కలుపుకోవాలి. వెనిగర్‌ వేసి కాసేపు చిన్నమంటపై ఉంచి, దింపుకొని వేడివేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2019-07-20T21:13:57+05:30 IST