నేతి అప్పం

ABN , First Publish Date - 2019-08-24T18:21:14+05:30 IST

బియ్యం - ఒకకప్పు, కందిపప్పు - ఒకటీస్పూన్‌, బెల్లం - ఒకకప్పు, అరటిపండు - ఒకటి, యాలకులు - నాలుగు, నెయ్యి - తగినంత, కొబ్బరిపొడి - రెండు టేబుల్‌స్పూన్లు.

నేతి అప్పం

కావలసినవి
 
బియ్యం - ఒకకప్పు, కందిపప్పు - ఒకటీస్పూన్‌, బెల్లం - ఒకకప్పు, అరటిపండు - ఒకటి, యాలకులు - నాలుగు, నెయ్యి - తగినంత, కొబ్బరిపొడి - రెండు టేబుల్‌స్పూన్లు.
 
తయారీవిధానం
 
బియ్యం, కందిపప్పును శుభ్రంగా కడిగి ఒకగంటసేపు నానబెట్టాలి. తరువాత నీళ్లు పూర్తిగా తీసివేసి మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. మెత్తగా అయ్యాక బెల్లం వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. ఇప్పుడు మిశ్రమం పలుచగా మారుతుంది. ఇప్పుడు అరటిపండును గుజ్జుగా చేసి వేయాలి. యాలకులు వేయాలి. కొబ్బరిపొడి వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి.
పొంగణాల పాన్‌ తీసుకొని నెయ్యి రాసుకోవాలి. గ్రైండ్‌ చేసుకున్న మిశ్రమాన్ని పాన్‌ గుంటల్లో వేయాలి. కాసేపు వేగాక అప్పంలను తిప్పుకోవాలి. గోధుమరంగులోకి వచ్చే వరకు వేగించి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-08-24T18:21:14+05:30 IST