క్యారెట్‌ తరుము పచ్చడి

ABN , First Publish Date - 2018-02-03T23:28:24+05:30 IST

క్యారెట్‌ - అరకేజీ, పచ్చికొబ్బరి - అర చిప్ప, మామిడి కాయ - ఒకటి, పచ్చిమిర్చి - కారం రుచిని...

క్యారెట్‌ తరుము పచ్చడి

కావలసిన పదార్థాలు
 
క్యారెట్‌ - అరకేజీ, పచ్చికొబ్బరి - అర చిప్ప, మామిడి కాయ - ఒకటి, పచ్చిమిర్చి - కారం రుచిని బట్టి, నూనె - రెండు టీ స్పూన్లు, ఎండుమిర్చి - ఒకటి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు - తాలింపుకు సరిపడా, పల్లీలు - గుప్పెడు, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - చిటికెడు.
 
తయారుచేసే విధానం
 
క్యారెట్లు శుభ్రపరచి కొబ్బరి, మామిడికాయలతో పాటుగా తురుముకోవాలి (మామిడికాయ లేకపోతే నిమ్మకాయ వాడుకోవచ్చు). పాన్‌లో నూనె వేడిచేసి తాలింపు దినుసులు, పల్లీలు, కరివేపాకు వేగించాలి. తర్వాత ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేగించాలి. ఇప్పుడు క్యారెట్‌, కొబ్బరి, మామిడి తురుము కలిపి రెండు నిమిషాలుంచి దించేయాలి. ఈ చట్నీ అన్నంలో కలుపుకున్నా, చపాతీలు,
దోసెలతో నంజుకున్నా బాగుంటుంది.

Updated Date - 2018-02-03T23:28:24+05:30 IST