పాలక్‌ సూప్‌

ABN , First Publish Date - 2018-03-03T23:54:48+05:30 IST

పాలకూర- కొంచెం, వెల్లుల్లి రెబ్బలు- ఐదు, వెన్న లేదా నూనె- ఒక టీస్పూను, ఫ్యాట్‌ తక్కువగా ఉన్న పాలు...

పాలక్‌ సూప్‌

కావలసినవి
 
పాలకూర- కొంచెం, వెల్లుల్లి రెబ్బలు- ఐదు, వెన్న లేదా నూనె- ఒక టీస్పూను, ఫ్యాట్‌ తక్కువగా ఉన్న పాలు- అరకప్పు, కార్న్‌ఫ్లోర్‌- ఒక టీస్పూను, మిరియాలపొడి, ఉప్పు- సరిపడా.
 
తయారీవిధానం
 
కాడలు తీసేసి పాలకూర ఆకుల్ని శుభ్రంగా కడగాలి. కుక్కర్‌లో కాస్తంత వెన్న వేడిచేసి అందులో వెల్లుల్లి రెబ్బల్ని వేగించాలి.  తరువాత కడిగిన పాలకూరని వేయాలి.
అందులో పాలు, అరకప్పు నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. ఉడికిన మిశ్రమం చల్లారాక దాన్ని గ్రైండ్‌ చేయాలి. కార్న్‌ఫ్లోర్‌ను నీళ్లల్లో వేసి చిక్కగా చేసి అందులో కలపాలి.
ఒకవేళ సూప్‌ చిక్కగా అయితే కార్న్‌ఫ్లోర్‌ కలపాల్సిన అవసరం లేదు. ఉప్పు, మిరియాలపొడిని కలిపి, తాజా క్రీము సూప్‌ పైన వేసుకుని వేడి వేడిగా తాగితే టేస్టీగా ఉంటుంది. ఈ సూప్‌ తాగితే శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. (పాలకూర ఇష్టంలేని వాళ్లు గుమ్మడికాయ, బ్రొకోలి, క్యారెట్‌ లేదా ఇష్టమైన ఏ కూరగాయలైనా వాడొచ్చు.)

Updated Date - 2018-03-03T23:54:48+05:30 IST