మామిడి పాయసం

ABN , First Publish Date - 2018-04-14T23:52:55+05:30 IST

మామిడిపండు గుజ్జు - ఒక కప్పు, అలంకరణకు - కొన్ని మామిడిపండుముక్కలు, పాలు- అర లీటరు...

మామిడి పాయసం

కావలసినవి
 
మామిడిపండు గుజ్జు - ఒక కప్పు, అలంకరణకు - కొన్ని మామిడిపండుముక్కలు, పాలు- అర లీటరు, బియ్యం - పావు కప్పు, చక్కెర - ఐదు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- చిటికెడు, నెయ్యి - ఒక టేబుల్‌స్పూను, జీడిపప్పులు - ఎనిమిది, ఎండుద్రాక్ష- పన్నెండు, యాలకులపొడి- అర టీస్పూను.
 
తయారీవిధానం
బియ్యాన్ని పావుగంట పాటు నీళ్లల్లో నానబెట్టాలి. నాన్‌స్టిక్‌ సాస్‌ పాన్‌లో పాలను మరిగించాలి. బియ్యం వడగట్టి మరుగుతున్న పాలల్లో వేయాలి. అన్నం మెత్తగా అయ్యే వరకూ గరిటెతో కలుపుతుండాలి. తర్వాత అందులో చక్కెర వేసి చిక్కబడేవరకూ కలపాలి. దాన్ని స్టవ్‌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. టేబుల్‌స్పూను నెయ్యిలో జీడిపప్పు, ఎండుద్రాక్షలను బ్రౌన్‌ రంగు వచ్చేదాకా వేగించి ఉడికిన అన్నంలో కలపాలి.
మామిడిపండు గుజ్జు, ఉప్పు (చిటికెడు), యాలకులపొడి వేసి బాగా కలపాలి. ఈ పాయసంపై జీడిపప్పులు, ఎండుద్రాక్ష చల్లి తింటే మధురంగా ఉంటుంది.

Updated Date - 2018-04-14T23:52:55+05:30 IST