క్యాబేజీ సూప్‌

ABN , First Publish Date - 2017-11-11T23:47:36+05:30 IST

క్యాబేజీ - పావు కేజీ, ఆలివ్‌ ఆయిల్‌ - ముప్పావు కప్పు, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్లు - 2, సెలెరీ కాడలు...

క్యాబేజీ సూప్‌

కావలసిన పదార్థాలు
 
క్యాబేజీ - పావు కేజీ, ఆలివ్‌ ఆయిల్‌ - ముప్పావు కప్పు, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్లు - 2, సెలెరీ కాడలు - 2, వెల్లుల్లి - 3, బంగాళ దుంపలు - 2, నీళ్లు - 8 కప్పులు, ఉప్పు - రుచికి కొద్దిగా, మిరియాల పొడి - అర టీ స్పూను, నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర - అలంకరణకు తగినంత.
తయారుచేసే విధానం
 
ముందుగా కూరగాయలన్నీ శుభ్రం చేసి సన్నగా తరిగి పక్కనుంచాలి. ఒక లోతైన పాత్రలో ఆలివ్‌ ఆయిల్‌ వేసి, వేడయ్యాక ఉల్లి తరుగు వేగించాలి. తర్వాత సెలెరీ, క్యారెట్‌ తరుగు వేసి ముక్కలు మెత్తబడ్డాక మెదిపిన వెల్లుల్లి, బంగాళదుంప ముక్కలు వేయాలి. పది నిమిషాల తర్వాత క్యాబేజీ, నీరు, ఉప్పు, మిరియాల పొడి వేసి మూత పెట్టి మరిగించాలి. ముక్కలన్నీ మెత్తబడ్డాక నిమ్మరంసం, కొత్తిమీర చల్లి దించాలి. సూప్‌ వేడి వేడిగా తాగితేనే రుచిగా ఉంటుంది.

Updated Date - 2017-11-11T23:47:36+05:30 IST