చిలగడదుంప చట్నీ

ABN , First Publish Date - 2017-12-10T00:15:16+05:30 IST

చిలగడ దుంప ముక్కలు - ఒక కప్పు, మినప్పప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, ఎండుమిర్చి - 5, చింతపండు - నిమ్మకాయంత...

చిలగడదుంప చట్నీ

కావలసిన పదార్థాలు
చిలగడ దుంప ముక్కలు - ఒక కప్పు, మినప్పప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, ఎండుమిర్చి - 5, చింతపండు - నిమ్మకాయంత, పచ్చికొబ్బరి తురుము - 4 టేబుల్‌ స్పూన్లు, నూనె - 2 టీస్పూన్లు. తాలింపు కోసం : ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, నూనె - తగినంత.
 
తయారుచేసే విధానం
ఒక స్పూను నూనెలో మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేగించి చల్లారనివ్వాలి. తర్వాత చిలగడ దుంప ముక్కలు, పచ్చికొబ్బరి, చింతపండు, ఉప్పుతో పాటుగా వేగిన పప్పుల మిశ్రమం కలిపి రుబ్బుకోవాలి. ఇప్పుడు విడిగా తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడి చపాతీలతో చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2017-12-10T00:15:16+05:30 IST