స్వీట్‌ కార్న్‌ సూప్‌

ABN , First Publish Date - 2017-09-09T22:02:29+05:30 IST

స్వీట్‌ కార్న్‌ - ఒక కప్పు, బటర్‌ - ఒక టేబుల్‌ స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 2, ఉల్లికాడలు - 2, బీన్స్‌ + క్యారెట్‌ తరుగు...

స్వీట్‌ కార్న్‌ సూప్‌

కావలసిన పదార్థాలు
 
స్వీట్‌ కార్న్‌ - ఒక కప్పు, బటర్‌ - ఒక టేబుల్‌ స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 2, ఉల్లికాడలు - 2, బీన్స్‌ + క్యారెట్‌ తరుగు - ఒక కప్పు, వెజిటబుల్‌ స్టాక్‌ - ఒక కప్పు, ఉప్పు - రుచికి తగినంత, (తెల్ల) మిరియాల పొడి - 1 టీ స్పూను, కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూను, నీరు - 1.5 లీటర్లు.
 
తయారుచేసే విధానం
 
ముందుగా పావు కప్పు స్వీట్‌కార్న్‌ని విడిగా తీసి మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కనుంచాలి. ఇప్పుడు లోతైన పాత్రలో వెన్న వేడి చేసి వెల్లుల్లి, ఉల్లికాడల, క్యారెట్‌, బీన్స్‌ తరుగులు, స్వీట్‌ కార్న్‌ ఒకటి తర్వాత ఒకటి వేస్తూ కొద్దిసేపు వేగించి నీరు పోసి, ఉప్పు జతచేసి మరిగించాలి. తర్వాత కొద్ది నీటిలో మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్‌ విడివిడిగా కరిగించి సూప్‌లో పోసి మరో 10 నిమిషాలు మరిగించి వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-09-09T22:02:29+05:30 IST