చికెన్‌ సూప్‌

ABN , First Publish Date - 2017-09-09T22:06:26+05:30 IST

బోన్‌లెస్‌ చికెన్‌ - బ్రెస్ట్‌, లెగ్‌ పీసులు (రెండేసి చొప్పున), నీరు - రెండున్నర లీటర్లు, ఉల్లిపాయ - ఒకటి..

చికెన్‌ సూప్‌

కావలసిన పదార్థాలు
 
బోన్‌లెస్‌ చికెన్‌ - బ్రెస్ట్‌, లెగ్‌ పీసులు (రెండేసి చొప్పున), నీరు - రెండున్నర లీటర్లు, ఉల్లిపాయ - ఒకటి, సెలరీ లీఫ్‌ - రెండు కాడలు, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - 3 రెబ్బలు, మిరియాలు - 10, లవంగాలు - 3, బిరియాని ఆకు - 1, కొత్తిమీర తరుగు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారుచేసే విధానం
 
దళసరి అడుగున్న లోతైన పాత్రలో (కొత్తిమీర తప్ప) పదార్థాలన్నీ వేసి కనీసం గంటన్నర సేపు మీడియం మంటపై మరిగించాలి. తర్వాత చికెన్‌ ముక్కలు విడిగా తీసి (ఎముకలు వేరు చేసి) సన్నగా తరగాలి. ఇప్పుడు మరిగిన సూప్‌ని వడకట్టి తరిగిన చికెన్‌ ముక్కలతో పాటుగా కొత్తిమీర చల్లి సర్వ్‌ చేయాలి. అవసరం అనుకుంటే విడిగా మిరియాల పొడి చల్లుకోవచ్చు.

Updated Date - 2017-09-09T22:06:26+05:30 IST