ఆవకాయ

ABN , First Publish Date - 2017-05-06T16:28:12+05:30 IST

కావాల్సిన పదార్థాలు: తరిగిన మామిడికాయ ముక్కలు- 6 కప్పులు, నూనె- 2 కప్పులు, ఆవపిండి- 1 కప్పు, ఎండుకారం- 1 కప్పు, రాళ్లఉప్పు- 3/4 కప్పు + ఒక టేబుల్‌స్పూను, మెంతిపొడి లేదా మెంతి గింజలు- 1.5 టీస్పూను, వెల్లుల్లి -1/2 కప్పు లేదా 70 గ్రాములు.

ఆవకాయ

కావాల్సిన పదార్థాలు: తరిగిన మామిడికాయ ముక్కలు- 6 కప్పులు, నూనె- 2 కప్పులు, ఆవపిండి- 1 కప్పు, ఎండుకారం- 1 కప్పు, రాళ్లఉప్పు- 3/4 కప్పు + ఒక టేబుల్‌స్పూను, మెంతిపొడి లేదా మెంతి గింజలు- 1.5 టీస్పూను, వెల్లుల్లి -1/2 కప్పు లేదా 70 గ్రాములు.
 
తయారీ విధానం: మామిడికాయల్ని నీళ్లలో ఒక గంటపాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి మెత్తటి బట్టతో తుడిచి ఆరబెట్టాలి. ఆ తర్వాత మామిడికాయలను టెంకతోపాటు ముక్కలుగా కోయాలి. వెల్లుల్లిపాయల పొట్టు తీసేయాలి. ఇష్టమున్నవారు కొన్ని వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా నూరి ఊరగాయలో కలుపుకోవచ్చు. పొడిగా ఉన్న పాత్రలో ఒక కప్పు ఆవపిండి పోయాలి. మెంతి గింజల్ని కూడా పొడి చేసి ఆవపిండిలో కలపాలి. పైన చెప్పిన కొలతల్లో రాళ్ల ఉప్పును మెత్తగా చేసి దాన్ని కూడా ఆ గిన్నెలోనే వేసి కలపాలి.
 
అందులో కారం, వెల్లుల్లి పాయల్ని కొలతల ప్రకారం వేసి కలపాలి. ఈ పొడిని కలిపేటప్పుడు చేతులకు అస్సలు తడి ఉండకూడదు. ఇంకో గిన్నెలో ఒకటిన్నర కప్పు నూనె పోసి అందులో కొన్ని మామిడి ముక్కలు వేసి గరిటెతో బయటకు తీయాలి. అలా నూనెలోంచి తీసిన మామిడి ముక్కలన్నింటినీ ముందే సిద్ధం చేసుకున్న మెంతి, ఆవ, ఉప్పుల మిశ్రమంలో కలిపి జాడీలో పెట్టాలి. మామిడికాయ ముక్కల్ని కలిపేటప్పుడు ఆవ, మెంతి, కారం, ఉప్పుల మిశ్రమం... నూనె వంటివి మిగిలిపోతే వాటిని మామిడికాయ ముక్కలపై చల్లాలి.
 
తర్వాత జాడి మీద మూతపెట్టి శుభ్రమైన గుడ్డతో కట్టేయాలి. ఇలా తయారుచేసిన ఊరగాయను తడి తగలకుండా మూడు రోజులు భద్రపరచాలి. నాలుగోరోజు మూత తీసి గరిటెతో ఆవకాయ ముక్కల్ని పైకి, కిందకు గరిటెతో కలపాలి. పచ్చడిని కాస్త రుచి చూసి అవసరమైతే ఉప్పు కలపొచ్చు. మరుసటిరోజు జాడీలో నూనె పైకి తేలిందో లేదో చూడాలి. ఒకవేళ తక్కువయితే మరికొంత కలుపుకోవచ్చు. ఈ ఊరగాయ సంవత్సరంపాటు నిలవవుండేందుకు ఉప్పు, నూనెలు ప్రిజర్వేటివ్స్‌లా పనిచేస్తాయి. అందుకే ఇవి తక్కువైతే ఊరగాయ పాడవుతుంది.

Updated Date - 2017-05-06T16:28:12+05:30 IST