బాదం హల్వ

ABN , First Publish Date - 2016-11-12T15:31:04+05:30 IST

కావలసిన పదార్థాలు: బాదం పప్పు: అరకప్పు, చక్కెర: ముప్పావు కప్పు, పాలు: అరకప్పు,

బాదం హల్వ

కావలసిన పదార్థాలు: బాదం పప్పు: అరకప్పు, చక్కెర: ముప్పావు కప్పు, పాలు: అరకప్పు, నెయ్యి: పావుకప్పు, కుంకుమ పువ్వు: టేబుల్‌ స్పూను.(కొద్దిగా పాలల్లో నానపెట్టుకోవాలి)
తయారీ విధానం: బాదంపప్పును ముందు రోజు నానపెట్టుకోవాలి అలా కుదరకపోతే మరుగుతున్న నీటిలో బాదంపప్పు వేసి అరగంట పాటు నానపెడితే పై తొక్క ఈజీగా వచ్చేస్తుంది. తొక్క తీసిన బాదంపప్పుకి కొద్దిపాటి పాలు జత చేసి మెత్తగా రుబ్బుకోవాలి. పావు కప్పు నీరు మరిగించి అందులో చక్కెర వేసుకోవాలి. చక్కెరను పొయ్యి మీద పెట్టకుండా కరిగేంత వరకూ ఆగి అనంతరం ఆ పాకంలో బాదం ముద్ద కుంకుమపువ్వును పాలతో సహా వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం గట్టిపడేటప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పైకి తేలేంత వరకూ పొయ్యి మీద ఉంచి దింపేసుకోవాలి.

Updated Date - 2016-11-12T15:31:04+05:30 IST