ముల్లంగి అవకాయ

ABN , First Publish Date - 2017-05-27T20:39:32+05:30 IST

కావలసిన పదార్థాలు ముల్లంగి- ఒక కిలో, రాళ్ల ఉప్పు- ఒక టేబుల్‌ స్పూను, ఉల్లికాడలు- అర

ముల్లంగి అవకాయ

కావలసిన పదార్థాలు
 
ముల్లంగి- ఒక కిలో, రాళ్ల ఉప్పు- ఒక టేబుల్‌ స్పూను, ఉల్లికాడలు- అర కప్పు, కారం- అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు- పావు కప్పు, అల్లం తురుము- ఒక టీ స్పూను, చక్కెర- రెండు టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ విధానం
 
ముల్లంగిని చల్లని నీటిలో గంట సేపు నానబెట్టాలి. తర్వాత తడి లేకుండా తుడిచి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో ముల్లంగి ముక్కలు, చక్కెర, ఉప్పు కలిపి అర గంటసేపు నానబెట్టాలి. ముల్లంగి ముక్కల నుంచి ఊరిన నీటిని తీసివేసి అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లికాడలు, కారం వేసి బాగా కలిపి జాడీలో నిల్వ చేసుకోవాలి.

Updated Date - 2017-05-27T20:39:32+05:30 IST