Advertisement
వంటలు

కాకరకాయ మసాలా కర్రీ

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - పావుకిలో, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - టీస్పూన్‌, వేరుసెనగలు - పావు కప్పు, కారం - అర టీస్పూన్‌, చింతపండు - కొద్దిగా, బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, కరివేపాకు - కొద్దిగా.
 
తయారీ విధానం:
కాకరకాయలను ఉడికించాలి. వేరుసెనగలు వేగించి పొట్టు తీసి పెట్టాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కలు వేసి మరికాసేపు వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరికాస్త నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేగించాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాకరకాయలు వేసి కలియబెట్టాలి. వేరుసెనగలు, ఉల్లిపాయలు, టొమాటో పేస్టు, బెల్లంలో అర కప్పు నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న కాకరకాయల్లో వేసి కలపాలి. తగినంత ఉప్పు, కారం వేసి చిన్నమంటపై పావుగంట పాటు ఉడికిస్తే కాకరకాయ మసాలా కూర రెడీ.

Advertisement
Advertisement

Indian Kitchens cooking మరిన్ని

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.