మండపం

ABN , First Publish Date - 2015-09-02T20:55:05+05:30 IST

కావలసిన పదార్థాలు: బియ్యపు పిండి - 100 గ్రా., పెసరపిండి - 50 గ్రా.,

మండపం

కావలసిన పదార్థాలు: బియ్యపు పిండి - 100 గ్రా., పెసరపిండి - 50 గ్రా., తరిగిన నల్లబెల్లం - 100 గ్రా., లవంగాల పొడి - పావు టీ స్పూను, మైదాపిండి - 100 గ్రా., నల్లనువ్వులు - 2 టీ స్పూన్లు, నెయ్యి వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: బెల్లం ముదురు పాకం వచ్చేలా తయారుచేసుకొని చల్లార్చి పక్కనుంచుకోవాలి. వెడల్పాటి పాత్రలో బియ్యపుపిండి, పెసరపిండి, లవంగాల పొడి, రెండు టీ స్పూన్ల నెయ్యి, చల్లారబెట్టిన బెల్లం పాకం వేసి ముద్దలా కలుపుకోవాలి. కప్పు నీటిలో నువ్వులు, మైదాపిండి కలిపి జారుగా చేసుకోవాలి. బెల్లం బియ్యప్పిండి ముద్దను చిన్న చిన్న ఉండల్లా చేసుకొని మైదాజారులో ముంచి నేతిలో దోరగా వేగించుకోవాలి.

Updated Date - 2015-09-02T20:55:05+05:30 IST