మెంతికూర లడ్డూ

ABN , First Publish Date - 2015-09-02T20:57:17+05:30 IST

కావలసిన పదార్థాలు: మెంతులు - అరకప్పు, గోధుమపిండి - 1 కప్పు, నెయ్యి - 4 టేబుల్‌ స్పూన్లు,

మెంతికూర లడ్డూ

కావలసిన పదార్థాలు: మెంతులు - అరకప్పు, గోధుమపిండి - 1 కప్పు, నెయ్యి - 4 టేబుల్‌ స్పూన్లు, బెల్లం తురుము - అరకప్పు, బాదం, పిస్తా, కిస్‌మిస్‌ తరుగు - అరకప్పు.
తయారుచేసే విధానం: మెంతులు దోరగా వేగించి మెత్తగా పొడి చేసి, 3 టేబుల్‌ స్పూన్లు నెయ్యిలో కలిపి ఒక రాత్రంతా ఉంచాలి. మిగతా నెయ్యిలో గోధుమపిండి వేగించి బెల్లం తురుము కలిపి, కరిగిన తర్వాత దించేసి డ్రైఫ్రూట్స్‌ తరుగుతో పాటు మెంతిపిండి కలిపి లడ్డూలు చుట్టుకోవాలి. రుచితో పాటు ఆరోగ్యం కలిగించే లడ్డూలు ఇవి.

Updated Date - 2015-09-02T20:57:17+05:30 IST