క్యారెట్‌ కస్టర్డ్‌ స్వీట్‌

ABN , First Publish Date - 2015-09-01T22:15:02+05:30 IST

కావలసినవి: క్యారెట్‌ ఒక కేజి, చక్కెర అరకేజి, పాలు ఒక లీటర్‌, నెయ్యి 50 గ్రా.,

క్యారెట్‌ కస్టర్డ్‌ స్వీట్‌

కావలసినవి: క్యారెట్‌ ఒక కేజి, చక్కెర అరకేజి, పాలు ఒక లీటర్‌, నెయ్యి 50 గ్రా., వెనిలా కస్టర్డ్‌ పౌడర్‌ 4 స్పూన్లు, కిస్‌మిస్‌, (సన్నగా తరిగిన) బాదం, పిస్తా, జీడిపప్పులు తగినన్ని.
ఎలా చేయాలి
క్యారెట్‌ చెక్కు తీసి సన్నగా తురమాలి. బాణలిలో నెయ్యి పోసి వేడిచేయాలి. క్యారెట్‌ తురుమును వేసి పచ్చివాసన పోయే వరకు సన్నని సెగమీద వేగించాలి. చక్కెర వేసి అది కరిగే వరకు బాగా వేగించాలి. తర్వాత మూడొంతుల పాలు పోసి కలపాలి. కిస్‌మిస్‌, పిస్తా ముక్కలు వేసి కొద్ది సేపు ఉడికించాలి. ఇప్పుడు మిగిలిన పాలలో కస్టర్డ్‌ పౌడర్‌ను కరిగించి, ఈ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. పదార్థమంతా చిక్కబడిన తర్వాత యాలకుల పొడి వేసి కలపాలి. జీడిపప్పులు, బాదం పపలు కూడా వేసి కలిపి కిందికి దించి చల్లార్చాలి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయిన తర్వాత సర్వ్‌ చేయాలి.

Updated Date - 2015-09-01T22:15:02+05:30 IST