చిలగడదుంప స్వీట్
ABN , First Publish Date - 2015-09-01T22:21:28+05:30 IST
కావలసిన పదార్థాలు: గోధుమపిండి - 50 గ్రా., బెల్లం - 100 గ్రా., సోంపు - 5 గ్రా.,
కావలసిన పదార్థాలు: గోధుమపిండి - 50 గ్రా., బెల్లం - 100 గ్రా., సోంపు - 5 గ్రా., ఉడికించి మెదిపిన చిలగడదుంప గుజ్జు - 1 కప్పు కిస్మిస్ - గుప్పెడు, యాలకులపొడి - 1 టీ స్పూను, పంచదార పొడి కొంత.
తయారుచేసే విధానం: వేడినీటిలో బెల్లం కరిగించి చల్లార్చాలి. ఆ నీటితో గోధుమపిండి, మెదిపి ఉంచుకున్న చిలగడదుంప గుజ్జు, కిస్మిస్, సోంపు, యాలకులపొడి వేసి చిక్కని జారులా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేడిచేశాక ఒక్కో స్పూను చొప్పున చిలగడదుంప జారుని వేసి బూరెల్లా దోరగా వేగించుకోవాలి. తీసిన తరువాత వీటిని పంచదార పొడిలో దొర్లించి తింటే ఎంతో రుచిగా ఉంటాయి.