ఫ్రూట్‌ కబాబ్‌

ABN , First Publish Date - 2019-03-21T13:54:27+05:30 IST

పండ్లముక్కలతో కూడా వెరైటీ కబాబ్స్‌ తయారుచేసుకోవచ్చు. ఆకర్షణీయంగా..

ఫ్రూట్‌ కబాబ్‌

పండ్లముక్కలతో కూడా వెరైటీ కబాబ్స్‌ తయారుచేసుకోవచ్చు. ఆకర్షణీయంగా, వెరైటీగా ఉండే ఫ్రూట్‌ కబాబ్స్‌ వేసవిలో శరీరం కోల్పోయిన లవణాలు, నీటిని తిరిగి అందిస్తాయి.
 
కావలసినవి: గింజలు తీసిన పుచ్చపండు ముక్కలు, పచ్చ ద్రాక్ష, బ్లూ బెర్రీ, రెండుగా కోసిన స్ట్రాబెర్లీలు, కివీ పండు ముక్కలు, అరటి పండు ముక్కలు అన్నీ కూడా ఒక్కో కప్పు.
 
తయారీ: పండ్ల ముక్కలను ఒక పాత్రలోకి తీసుకొని ఒక్కొక్కటిగా స్వీవర్స్‌ (ఇనుప కడ్డీ)కు గుచ్చాలి. ఒక గిన్నెలో క్రీమ్‌, తేనె, దాల్చినచెక్క, నారింజ రసం తీసుకోవాలి. దీనిలో ఫ్రూట్‌ కబాబ్‌ను ముంచి తినాలి. ఆకర్షణీయంగానూ, వెరైటీగానూ ఉండే వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.

Updated Date - 2019-03-21T13:54:27+05:30 IST