వెజ్‌ హలీమ్‌

ABN , First Publish Date - 2018-05-26T21:32:58+05:30 IST

గోధుమరవ్వ-అరకప్పు, ఓట్స్‌- రెండు టేబుల్‌స్పూన్లు, ఎర్రకందిపప్పు, పెసరపప్పు, మినపప్పు...

వెజ్‌ హలీమ్‌

కావలసినవి
 
గోధుమరవ్వ-అరకప్పు, ఓట్స్‌- రెండు టేబుల్‌స్పూన్లు, ఎర్రకందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, నువ్వులు- ఒక్కొక్కటీ ఒక్కో టేబుల్‌స్పూను, మిరియాలు-పావు టీస్పూను, యాలకులు-మూడు, లవంగాలు-నాలుగు, దాల్చినచెక్క-చిన్నముక్కలు రెండు, జీలకర్ర-ఒక టీస్పూను, సోయా వాటర్‌ గ్రాన్యూల్స్‌-పావు కప్పు (నీళ్లల్లో పదినిమిషాలు నాననిచ్చి), బాదంపప్పులు, జీడిపప్పు- ఒక్కొక్కటీ ఒక్కో టేబుల్‌స్పూను, ఉల్లిపాయలు- రెండు (సన్నటి ముక్కలుగా తరిగి), మిక్స్‌డ్‌ వెజిటబుల్స్‌-అరకప్పు(క్యారెట్‌, బీన్స్‌, పచ్చిబటాణీ గింజలు, గ్రీన్‌ బీన్స్‌, లిమా బీన్స్‌ లాంటివి), పాలు-అర కప్పు, పచ్చిమిర్చి-మూడు (నిలువుగా కట్‌ చేసి), పుదీనా, కొత్తిమీర - ఒక్కొక్కటీ ఒక్కో అర కప్పు (తరుగు), ఉప్పు- రుచికి సరిపడా, నిమ్మకాయముక్కలు- అలంకరణకు.
 
తయారీవిధానం
 
గోధుమరవ్వ నుంచి జీరా వరకూ పైన చెప్పిన అన్ని పదార్థాలనూ పొడిగా గ్రైండ్‌ చేయాలి. ఈ పొడి ఒక కప్పు ఉంటుంది.పాన్‌ తీసుకుని రెండు టేబుల్‌స్పూన్ల నూనె అందులో వేయాలి. వేడెక్కిన నూనెలో తరిగిపెట్టుకున్న ఉల్లిపాయముక్కల్ని వేసి బ్రౌన్‌ రంగులో వచ్చేవరకూ వేగించి ఒక ప్లేటులో పోయాలి.ప్రెషర్‌ కుక్కర్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసి అందులో జీడిపప్పును బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వే సి వేగించాలి. ఇందులో వేగించిన ఉల్లిపాయలను (అలంకరణకు కొద్దిగా విడిగా తీసి) కూడా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. మిక్స్‌డ్‌ వెజిటబుల్స్‌ కూడా ఇందులో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
నానబెట్టిన సోయా గింజల్లోని నీళ్లను తీసేసి ప్రెషర్‌కుక్కర్‌లో వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి. అందులో పాలు కూడా ఉడకనివ్వాలి. తర్వాత మూడు కప్పుల నీళ్లు అందులో పోసి పుదీనా, కొత్తిమీర తరుగు వేయాలి. రెడీ చేసి పెట్టుకున్న పొడిని, రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులో వేసి ఉండ కట్టకుండా కలపాలి. ఈ మిశ్రమం మరుగుకు వచ్చేదాకా ఉంచి కుక్కర్‌పై మూతపెట్టి 15 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి. ఆవిరి తగ్గిన తర్వాత కుక్కర్‌ మూత తీసి అందులోని మిశ్రమాన్ని మాషర్‌తో మెత్తగా చేయాలి. ఇలా రెడీ అయిన వెజ్‌ హలీమ్‌పై పుదీనా, కొత్తిమీర తరుగు, నిమ్మకాయముక్కలు, వేగించిన నట్స్‌లతో అలంకరించి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2018-05-26T21:32:58+05:30 IST