నేరేడు ఫిజ్‌

ABN , First Publish Date - 2018-08-11T22:26:03+05:30 IST

కాక్‌టైల్‌ షేకర్‌లో సోడా, యాపిల్‌జ్యూసు పోసి రెండూ బాగా కలిసేంతవరకూ షేక్‌ చేయాలి...

నేరేడు ఫిజ్‌

కావలసినవి
 
నేరేడుపళ్లు - 12, లెమన్‌ సోడా - 200 ఎంఎల్‌, యాపిల్‌ జ్యూస్‌ - 500 ఎంఎల్‌.
 
తయారీవిధానం
 
కాక్‌టైల్‌ షేకర్‌లో సోడా, యాపిల్‌జ్యూసు పోసి రెండూ బాగా కలిసేంతవరకూ షేక్‌ చేయాలి.
ఈ మిశ్రమాన్ని కాక్‌టైల్‌ గ్లాసుల్లో పోసి నేరేడుపళ్లను అందులో వేయాలి.
నేరేడు పళ్లను కొన్ని నిమిషాలపాటు అందులోనే ఉండనివ్వాలి. సర్వింగ్‌ చేసే ముందర గ్లాసుల్లో ఫిజ్జీ లైమ్‌ సోడా పోయాలి. వెరైటీ రుచితో జామూన్‌ ఫిజ్‌ పసందుగా ఉంటుంది.

Updated Date - 2018-08-11T22:26:03+05:30 IST