రొయ్యల కూర

ABN , First Publish Date - 2018-03-31T21:26:28+05:30 IST

రొయ్యలు - 300 గ్రాములు (పొట్టు వలిచి), మామిడికాయ - ఒకటి (తరిగి), యాలకులు - రెండు

రొయ్యల కూర

కావలసినవి
 
రొయ్యలు - 300 గ్రాములు (పొట్టు వలిచి), మామిడికాయ - ఒకటి (తరిగి), యాలకులు - రెండు, దాల్చినచెక్క- చిన్న ముక్క, అల్లం- చిన్న ముక్క (సన్నగా తరిగి), వెల్లుల్లి రెబ్బలు- నాలుగు (సన్నగా తరిగి), పసుపు - ఒక టీస్పూను, కారం - ఒక టీస్పూను, వెనిగర్‌ - ఒక టీస్పూను, నిమ్మరసం - కొంచెం, కొబ్బరిపాలు - ఒక కప్పు, ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగి), తాజా కొబ్బరి తురుము - అర కప్పు, కరివేపాకు- రెండు రెబ్బలు.
 
తయారీవిధానం
 
రొయ్యల్లో నిమ్మరసం, పసుపు వేసి బాగా కలిపి, అరగంట నానబెట్టాలి. ఉల్లిపాయ తరుగు, కొబ్బరి, కరివేపాకులను మిక్సీ జార్‌లో వేయాలి. అందులో కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. కడాయిలో నూనె పోసి వేడెక్కిన తర్వాత మసాలా దినుసులన్నింటినీ అందులో వేయాలి. అల్లం, వెల్లుల్లి ముక్కలను కూడా వేసి అవి మెత్తగా అయ్యేవరకూ వేగించాలి. తరువాత కొబ్బరి, ఉల్లిపాయ గుజ్జు వేసి పచ్చివాసన పోయేదాకా వేగించాలి. నానబెట్టిన రొయ్యలు, పచ్చిమామిడి ముక్కలను మసాలాలో వేసి బాగా కలపాలి. కొబ్బరిపాలు, ఉప్పు, కారం, వెనిగర్‌ అందులో వేసి మామిడిముక్కలు, రొయ్యల్ని కూడా వేయాలి. అవసరమైతే కూరలో కొన్ని నీళ్లు చల్లాలి. ఇలా చేయడం వల్ల కూర చిక్కగా తయారవుతుంది. సన్నని మంటపై రొయ్యలు, మామిడి ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. ఉప్పు, మసాలాలు రుచికి సరిపడా ఉండాలి. మామిడి కాయ కలిసిన రొయ్యల కూర తింటుంటే నోటికి పుల్లపుల్లగా, ఘాటుగా రుచి తగులుతూ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకే కాకుండా చపాతీ, పూరీ, రొట్టెల్లోకి కూడా ఈ కూర బాగుంటుంది.

Updated Date - 2018-03-31T21:26:28+05:30 IST