హనీ రోస్ట్‌ చికెన్‌

ABN , First Publish Date - 2017-12-02T16:51:35+05:30 IST

కోడి (స్కిన్‌ తీయకుండా) - ఒకటి, నిమ్మరసం-50 ఎంఎల్‌, వెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూను, కశ్మీరీ మిర్చి- ఒకటిన్నర స్పూను, నూనె-50 ఎంఎల్‌.

హనీ రోస్ట్‌ చికెన్‌

కావలసినవి: కోడి (స్కిన్‌ తీయకుండా) - ఒకటి, నిమ్మరసం-50 ఎంఎల్‌, వెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూను, కశ్మీరీ మిర్చి- ఒకటిన్నర స్పూను, నూనె-50 ఎంఎల్‌.
 
నానబెట్టేందుకు: రెండు పెద్ద ఉల్లిపాయల్ని తరిగి నూనెలో వేగించాలి. పెరుగు-150 ఎంఎల్‌, అల్లం పేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ- ఒకటి (మెత్తగా గ్రైండ్‌ చేయాలి), ధనియాలపొడి- ఒక టీస్పూను, దాల్చినచెక్క పొడి- పావు టీస్పూను, రెండు యాలకులు (పొడి చేసి), గ్రీన్‌ యాలకులు-6 (పొడి చేసి), నల్ల మిరియాలు -10 (పొడి చేసి), ఉప్పు- ఒక టీస్పూను.
 
స్టఫ్ఫింగ్‌: ఉల్లి తరుగు - కొద్దిగా, అల్లం, వెల్లుల్ని ముక్కలు- ఒక్కో టీస్పూను చొప్పున, లవంగాల పొడి- అర టీస్పూను, పచ్చిమిర్చి తరుగు-3
వండడానికి: తేనె-50 ఎంఎల్‌, నూనె-25 ఎంఎల్‌.
 
తయారీ:
  • చికెన్‌ మీద లోతుగా గాట్లు పెట్టాలి.
  • నిమ్మరసం, వెల్లుల్లి, కారాలను బాగా కలపాలి.
  • వేగించిన ఉల్లితరుగును గ్రైండ్‌ చేసి ఆ పేస్టును మిగతా పదార్థాలతో కలిపి నానబెట్టాలి.
  • ఆ పేస్టులో 2/3 వంతు భాగాన్ని చికెన్‌ లోపల, పైభాగాలకు పట్టించి గంట పాటు ఉంచాలి.
  • మిగిలిన పేస్టును స్టఫ్పింగ్‌ పదార్థాల్లో కలిపి చికెన్‌ లోపల కూరాలి.
  • ఆ చికెన్‌ని రోస్టింగ్‌ టిన్‌లో పెట్టి 220 సెంటిగ్రేడ్‌లో రోస్ట్‌ చేయాలి.
  • చికెన్‌ మెత్తగా అయ్యే వరకు ఒవెన్‌లో ఉడికించాలి.
  • ఆ తర్వాత చికెన్‌పై తేనే పోసి మరో పది నిమిషాలు ఒవెన్‌లో ఉడికించాలి.
  • అలా తయారైన హనీ రోస్ట్‌ చికెన్‌ పైన కాస్త నూనె రాసి తింటే బాగుంటుంది.

Updated Date - 2017-12-02T16:51:35+05:30 IST