మిల్క్‌ కేక్‌

ABN , First Publish Date - 2016-08-27T18:58:45+05:30 IST

పంచదార- 4 కప్పులు, పాలు - 5 కప్పులు, బొంబాయి రవ్వ - ఒక కప్పు, నెయ్యి - 1 1/2 కప్పు.

మిల్క్‌ కేక్‌

కావలసిన పదార్ధాలు: పంచదార- 4 కప్పులు, పాలు - 5 కప్పులు, బొంబాయి రవ్వ - ఒక కప్పు, నెయ్యి - 1 1/2 కప్పు.

 
తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో పాలు పోసుకుని, అందులో బొంబాయి రవ్వ, పంచదార, నెయ్యి అన్నీ కలపాలి. పాత్రను స్టవ్‌పై ఉంచి, సన్నని సెగపై రవ్వ ఉడికి దగ్గరగా అయ్యేంతవరకూ గరిటతో తిప్పుతూ ఉండాలి. అలా నెయ్యి పైకి తేలేంతవరకూ ఉడికించుకోవాలి. తరువాత నెయ్యి రాసిన ట్రేలో పోసి పైన జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి చల్లార్చాలి. ఆపైన కావాల్సిన సైజులో కట్‌ చేసుకోవాలి. అంతే మిల్క్‌ కేక్‌ స్వీట్‌ రెడీ టూ ఈట్‌ అంటూ నోరూరిస్తుంది మీకు.

Updated Date - 2016-08-27T18:58:45+05:30 IST