ఆరెంజ్‌ జామ్‌

ABN , First Publish Date - 2015-09-01T21:57:29+05:30 IST

కావలసిన పదార్థాలు: ఆరెంజ్‌లు - 8, నిమ్మకాయలు - 2, పంచదార, నీరు - ఆరెంజ్‌ గుజ్జుకి సమాన కొలత

ఆరెంజ్‌ జామ్‌

కావలసిన పదార్థాలు: ఆరెంజ్‌లు - 8, నిమ్మకాయలు - 2, పంచదార, నీరు - ఆరెంజ్‌ గుజ్జుకి సమాన కొలత.
తయారుచేసే విధానం: ఆరెంజ్‌ పండ్ల తొక్క (సన్నగా) గీరి పక్కనుంచాలి. తర్వాత గింజలు తీసిన ఆరెంజ్‌ గుజ్జులో నిమ్మరసం, నీరు, ఒక టేబుల్‌ స్పూను తొక్క తురుము కలిపి అన్నీ సగమయ్యేవరకు మరిగించాలి. తర్వాత మంట తగ్గించి పంచదార వేసి, కలుపుతూ తీగపాకం రాగానే దించేయాలి. వేడిగా ఉన్నప్పుడే గాజు సీసాల్లో పోసి మూత పెట్టి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి.

Updated Date - 2015-09-01T21:57:29+05:30 IST