కొబ్బరి కారం

ABN , First Publish Date - 2015-09-01T22:42:02+05:30 IST

కావలసిన పదార్థాలు: ఎండుకొబ్బరి తురుము - 1 కప్పు, ఎండుమిర్చి - 6, ఆమ్‌ చూర్‌ (మామిడిపొడి)

కొబ్బరి కారం

కావలసిన పదార్థాలు: ఎండుకొబ్బరి తురుము - 1 కప్పు, ఎండుమిర్చి - 6, ఆమ్‌ చూర్‌ (మామిడిపొడి) - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, వెల్లుల్లి రేకలు - 6
తయారుచేసే విధానం: ఎండుమిర్చిని మూకుడులో వేగించుకొని చల్లారనివ్వాలి. మిక్సీలో మిర్చిని పొడిచేసి అందులోనే కొబ్బరి తురుము, వెల్లుల్లి రేకలు, ఉప్పు వేసి మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. ఈ పొడి వేడి వేడి అన్నంలో/ఇడ్లీల్లో కాస్త నెయ్యితో పాటు తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-01T22:42:02+05:30 IST