వరియాలి షర్బత్‌

ABN , First Publish Date - 2018-05-23T16:10:05+05:30 IST

వరియాలి (సోంపు) - ఒక కప్పు, పంచదార లేదా మిష్రీ - మూడు కప్పులు, నల్లమిరియాలు...

వరియాలి షర్బత్‌

పొడి కోసం కావలసినవి
వరియాలి (సోంపు) - ఒక కప్పు, పంచదార లేదా మిష్రీ - మూడు కప్పులు, నల్లమిరియాలు - ఒక టీస్పూన్‌, యాలక్కాయ గింజలు - కొన్ని, గసగసాలు - ఒక టేబుల్‌ స్పూన్‌. (ఈ పొడితో 20 గ్లాసుల డ్రింక్‌ తయారుచేసుకోవచ్చు)
 
నీళ్లతో ఒక గ్లాసు వరియాలి షర్బత్‌కు
తయారుచేసుకున్న పొడి - రెండు టేబుల్‌ స్పూన్లు లేదా రుచికి సరిపడా, నీళ్ల - ఒకట్నిర కప్పులు, నిమ్మరసం - అర టీస్పూన్‌, ఐస్‌క్యూబ్స్‌, పుదీనా - కొంచెం.
పాలతో ఒక గ్లాసు వరియాలి షర్బత్‌కు:
చల్లటి పాలు - ఒకటిన్నర కప్పులు, తయారుచేసుకున్న పొడి - రెండు టేబుల్‌ స్పూన్లు.
 
తయారీవిధానం
పొడి కోసం కావలసిన పదార్థాలన్నింటినీ ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి.
తరువాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్‌ చేయాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్‌లాక్‌ బ్యాక్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే నాలుగు నుంచి ఐదు నెలల వరకు నిల్వ ఉంటుంది.
మీకు ఎప్పుడు షర్బత్‌ తాగాలనిపిస్తే అప్పుడు వరియాలి షర్బత్‌ తాగేందుకు పొడి సిద్ధం.
నీళ్లతో తాగాలనిపిస్తే ఒక గ్లాసులో ఐస్‌క్యూబ్స్‌, నిమ్మరసం, పుదీనా వేసి తయారుచేసుకున్న పొడిని వేయాలి. తరువాత మంచినీళ్లు పోసి బాగా కలిపి తాగేయాలి.
అదే పాలతో తాగాలనిపిస్తే తయారుచేసుకున్న పొడి, చల్లటి పాలు పోసి బాగా కలపాలి. రెడీ అయిన సోంపు మిల్క్‌షేక్‌ను చల్లగా తాగేయడమే తరువాయి.

Updated Date - 2018-05-23T16:10:05+05:30 IST