పచ్చి దోసకాయ పచ్చడి

ABN , First Publish Date - 2015-09-02T15:59:21+05:30 IST

కావలసిన పదార్థాలు: దోసకాయ కోరు(గింజలతో పాటు) -1 కప్పు, పచ్చిమిర్చి ముద్ద - అర టీ స్పూను

పచ్చి దోసకాయ పచ్చడి

కావలసిన పదార్థాలు: దోసకాయ కోరు(గింజలతో పాటు) -1 కప్పు, పచ్చిమిర్చి ముద్ద - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు, తాలింపు కోసం: ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు (తగినంత)
తయారుచేసే విధానం: దోసకోరులో ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద కలిపి పక్కనుంచుకోవాలి. కడాయిలో నూనె వేసి తాలింపు పెట్టి దోసకోరులో కలిపేయాలి. ఇది అన్నంతో కలుపుకున్నా, ఉత్తిగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-02T15:59:21+05:30 IST