అరటితో పాన్‌కేక్స్‌

ABN , First Publish Date - 2015-08-29T22:41:05+05:30 IST

కావలసిన పదార్థాలు: పండిన అరటిపండు - 1, మైదా - 1 కప్పు, పాలు - 2 కప్పులు

అరటితో పాన్‌కేక్స్‌

కావలసిన పదార్థాలు: పండిన అరటిపండు - 1, మైదా - 1 కప్పు, పాలు - 2 కప్పులు, పంచదార - 2 టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ పౌడర్‌ - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం:పాలల్లో పంచదార, బేకింగ్‌ పౌడర్‌, మైదా, అరటిపండు గుజ్జు వేసి బాగా కలపాలి. మరీ గట్టిగా అనిపిస్తే కొంత నీరు పోసి జారుగా చేసుకోవాలి. తర్వాత పెనంపై బటర్‌ రాసి దోశల్లా మందంగా పోసుకుని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. వేడి వేడిగా తేనెతో పాటు తింటే చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు.

Updated Date - 2015-08-29T22:41:05+05:30 IST