చంద్రవంకలు

ABN , First Publish Date - 2015-08-29T23:20:58+05:30 IST

పూరీలకు కావలసిన పదార్థాలు: మైదా - వందగ్రాములు, గుడ్డు - 1, ఉప్పు తగినంత, నూనె - 5 గ్రాములు

చంద్రవంకలు

పూరీలకు కావలసిన పదార్థాలు: మైదా - వందగ్రాములు, గుడ్డు - 1, ఉప్పు తగినంత, నూనె - 5 గ్రాములు, నీళ్లు- 40 మి.లీ.
కూరడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు - 10 గ్రాములు, వెల్లులి ్ల- 5 గ్రాములు, పచ్చిమిర్చి - 5 గ్రాములు, కొత్తిమీర - 1 కట్ట, తరిగిన అల్లం - 5 గ్రాములు, కైమా - 160 గ్రాములు, ఉప్పు, మిరియాల పొడి రుచికి తగినంత.
తయారుచేసే విధానం
కడాయిలో తరిగిన ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిని వేగనిచ్చి కైమాను కూడా చేర్చి కొద్దిగా నీటిని జతచేసి బాగా ఉడకనివ్వాలి. కైమా ఉడికిన తరువాత మిగతా పదార్థాలన్నీ వేసి కలయతిప్పి దించేయాలి. ముందుగా తయారుచేసి ఉంచుకున్న మైదాముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలి. ఉడికిన కైమాను ఒక టేబుల్‌స్పూనుతో తీసుకుని పూరీ మధ్యలో పెట్టి అర్థ చంద్రాకారంలో పూరీని మడచి అంచుల్ని ఒత్తుకోవాలి. అన్నీ అలా తయారుచేశాక పెనంపైన నూనెవేసి రెండువైపులా గోల్డ్‌ కలర్‌ వచ్చేలా కాల్చుకోవాలి. వీటిని వేడివేడిగా టమేటోసాస్‌తో తింటే చాలా బాగుంటాయి.

Updated Date - 2015-08-29T23:20:58+05:30 IST