పంజాబ్ సీఎం కానున్న భగవత్ మాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?... కమెడియన్ నుంచి సీఎం వరకూ..

ABN , First Publish Date - 2022-03-10T17:43:53+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంగ్రూర్..

పంజాబ్ సీఎం కానున్న భగవత్ మాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?... కమెడియన్ నుంచి సీఎం వరకూ..

ఇంటర్నెట్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంగ్రూర్ ఎంపీ భగవత్ మాన్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి కానున్నారు. నటుడు భగవత్ మాన్ సింగ్ వృత్తిరీత్యా హాస్యనటుడు, 2011లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత సంగ్రూర్ నుంచి రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. భగవత్ మాన్ 2014, 2019 లో ఆమ్ ఆద్మీ పార్టీ నుండి లోక్ సభ ఎన్నికలలో గెలిచారు. మాన్‌ని జుగ్ను అనే పేరుతో కూడా కూడా పిలుస్తారు. పంజాబీ హాస్యనటునిగా భగవత్ మాన్ మంచి పేరు సంపాదించారు. ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మతో కలిసి మాన్ టీవీ షో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌లో కూడా పాల్గొన్నారు. భగవత్ మాన్ పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని సతోజ్ గ్రామంలో 1973 అక్టోబర్ 17న జన్మించారు. ఎన్నికల అఫిడవిట్‌లో భగవత్ మాన్ తాను 12వ తరగతి ఉత్తీర్ణుడయ్యాడని పేర్కొన్నారు. 


1992లో బి.కాం చేయడానికి షాహీద్ ఉధమ్ సింగ్ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నా అతని చదువు పూర్తి కాలేదు. భగవత్ మాన్ సింగ్ ఇంద్రప్రీత్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. ఎంపీ అయిన ఏడాదికే ఆయన భార్యతో విడిపోయారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు వారి తల్లి సంరక్షణలో ఉంటున్నారు. భగవంత్ మాన్.. పంజాబ్ పీపుల్స్ పార్టీతో తన రాజకీయ ప్రవేశం చేశారు. 2012 సంవత్సరంలో లెహ్రా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశాడు. కానీ పరాజయం పాలయ్యారు. భగవత్ మాన్ 2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అదే ఏడాది ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై సంగ్రూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ ఆయన రెండు లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక టీవీ షోలో మాట్లాడుతూ పంజాబ్ ముఖ్యమంత్రికి భగవత్ మాన్ కంటే మంచి నిజాయితీ గల వ్యక్తి అని పేర్కొన్నారు. కాగా ఎంపీ భగవత్ మాన్‌పై 7 ఏళ్లుగా ఒక్క ఆరోపణ కూడా లేదు. ఆయన ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భగవత్ మాన్ తన కుటుంబం గురించిన వివరాలు తెలిపారు. తాను కమెడియన్‌గా ఉన్నంత కాలం కుటుంబానికి చాలా సమయం కేటాయించేవాడినని చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాక, భార్యా పిల్లలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయానన్నారు. 2015లో తాను భార్యతో విడిపోవడానికి ఇదే కారణమన్నారు. ప్రస్తుతం అతని భార్యాపిల్లలు అమెరికాలో ఉంటున్నారు. 



Updated Date - 2022-03-10T17:43:53+05:30 IST