గ్రామకంఠం భూమికి ఎసరు

ABN , First Publish Date - 2022-09-29T06:35:52+05:30 IST

వేలేరుపాడు మండలం కొయిదా గ్రామానికి చెందిన గ్రామకంఠం భూమి సర్వే నెంబరు 29లో 44 ఎకరాలను ఆరుగురు వ్యక్తుల పేరిట బద లాయించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పొందేందుకు రంగం సిద్ధం చేశారు.

గ్రామకంఠం భూమికి ఎసరు
వేలేరుపాడు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న గిరిజనులు

44 ఎకరాలను వేరే వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కొయిదా గ్రామస్థుల ధర్నా


వేలేరుపాడు, సెప్టెం బరు 28 : వేలేరుపాడు మండలం కొయిదా గ్రామానికి చెందిన గ్రామకంఠం భూమి సర్వే నెంబరు 29లో 44 ఎకరాలను ఆరుగురు వ్యక్తుల పేరిట బద లాయించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పొందేందుకు రంగం సిద్ధం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని భూనష్టపరిహారం వారికి చెం దేలా సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం కొయిదా గ్రామస్థులు తహసీ ల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ గ్రామకంఠం భూమి తాత ల కాలం నుంచి తమ ఆదీనంలోనే ఉందని దీనిపై కన్నేసిన అక్రమార్కులు రెవె న్యూ అధికారుల సహకారంతో కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పూర్తి విచారణ చేయకుండానే ఈ భూమి ని ఆరుగురు వ్యక్తులకు దారాదత్తం చేయేడమే కాకుండా 44 ఎకరాలకు ఎకరా ఒక్కింటికి రూ.10.50 లక్షలు భూనష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధం అవుతున్నా రని అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. జోరున వర్షం కురుస్తు న్నా రెండు గంటలపాటు ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించి న్యాయం చేస్తామని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


Updated Date - 2022-09-29T06:35:52+05:30 IST