ఆ రాష్ట్రంలో 12.8 శాతం జనాభాకు మానసిక ఆరోగ్య సమస్యలు...

ABN , First Publish Date - 2021-10-11T15:21:49+05:30 IST

కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

ఆ రాష్ట్రంలో 12.8 శాతం జనాభాకు మానసిక ఆరోగ్య సమస్యలు...

తిరువనంతపురం: కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ రాష్ట్రంలో 12.8శాతం జనాభా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మంత్రి వీణాజార్జ్ చెప్పారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి శాస్త్రీయ చికిత్స అవసరమని మంత్రి చెప్పారు. కొవిడ్ అనంతరం పలువురు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వారికి చికిత్స చేయించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం సజావుగా ఉంటేనే సమాజం మనుగడ పురోగతి సాధ్యమవుతుందని మంత్రి చెప్పారు.మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన లేదని, ఆరోగ్యశాఖ అందరి సహకారంతో అందరికీ వైద్యం అందించే కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు.


ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సైకియాట్రీ, తిరువనంతపురం మెడికల్ కాలేజీ కేరళ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ నిర్వహించిన ఆన్‌లైన్ సెమినార్‌ను మంత్రి ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘పిల్లల మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. సమాజంలో మానసిక ఆరోగ్యం గురించి అపోహలు ఉన్నాయి, వీటి కోసం మనం సరైన అవగాహన ప్రచారం ద్వారా మార్చాలి.’’ అని మంత్రి వీణా జార్జ్ చెప్పారు.


Updated Date - 2021-10-11T15:21:49+05:30 IST