వ్యాక్సిన్ తీసుకోని వారికి గుడ్‌ న్యూస్.. అబుధాబి కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-03-18T16:36:23+05:30 IST

అబుధాబి కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నిబంధనల్లో సవరిస్తూ.. వ్యాక్సిన్ తీసుకోని వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. సవరించిన మార్గదర్శకాలు మార్చి 17 నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కాగా

వ్యాక్సిన్ తీసుకోని వారికి గుడ్‌ న్యూస్.. అబుధాబి కీలక ప్రకటన

ఎన్నారై డెస్క్: అబుధాబి కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నిబంధనల్లో సవరిస్తూ.. వ్యాక్సిన్ తీసుకోని వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. సవరించిన మార్గదర్శకాలు మార్చి 17 నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



కొవిడ్ విజృంభణ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే అబుధాబి కూడా కఠిన నిబంధనలను అమలు పర్చింది. అయితే ప్రస్తుతం కొవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోని రెసిడెంట్లు, టూరిస్టులకు తీపి కబురు చెప్పింది. కల్చరల్, టూరిస్ట్ ప్రదేశాల్లోకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు మార్చి 17 నుంచే అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. అయితే.. సదరు వ్యక్తులు..  ఆయా ప్రదేశాలను సందర్శించే కంటే 48 గంటల ముందు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ పొందాలని స్పష్టం చేసింది. 




Updated Date - 2022-03-18T16:36:23+05:30 IST