Abu Dhabi: అసలే వేసవి కాలం.. ఈ విషయంలో అస్సలు అలసత్వం వహించకండి.. పోలీసుల హెచ్చరిక!

ABN , First Publish Date - 2022-07-17T17:03:49+05:30 IST

అబుధాబిలో వేసవి కాలం వచ్చేసింది. సూర్యుడి భగభగతో అక్కడ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలను సోషల్ మీడియా వేదికగా అలర్ట్ చేశారు. ఏ మాత్రం అలసత్వం వహించినా భారీ మూల్యం తప్పదంటూ హెచ్చరించారు. పోలీ

Abu Dhabi: అసలే వేసవి కాలం.. ఈ విషయంలో అస్సలు అలసత్వం వహించకండి.. పోలీసుల హెచ్చరిక!

ఎన్నారై డెస్క్: అబుధాబిలో వేసవి కాలం వచ్చేసింది. సూర్యుడి భగభగతో అక్కడ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలను సోషల్ మీడియా వేదికగా అలర్ట్ చేశారు. ఏ మాత్రం అలసత్వం వహించినా భారీ మూల్యం తప్పదంటూ హెచ్చరించారు. పోలీసులు దేని గురించి హెచ్చరించారు. అని ఆలోచిస్తున్నారా.. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. 



వేసవి కాలం మొదలైతే.. ఉష్ణోగ్రతలు పెరగడమనేది సహజమే. అయితే.. ఎడారి దేశాల్లో ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో తారు రోడ్లు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతాయి. ఈ క్రమంలో వాహనాల్లో ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం తప్పదు. వాహనదారులను అప్రమత్తం చేసే క్రమంలోనే అబుధాబి పోలీసులు తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. నాణ్యతలేని టైర్లు గల వాహనాల్లో ప్రయాణించడం ద్వారా చోటు చేసుకునే ప్రమాదాలను వివరించే వీడియోను అధికారులు పోస్ట్ చేశారు. కాలం చెల్లిన టైర్ల‌తో వాహనాలను నడిపితే.. యాక్సిడెంట్లు అవటంతోపాటు ఇతర ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలించిన వారవుతారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రయాణాన్ని ప్రారంభించే ముందే.. టైర్ల నాణ్యతను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా కాలం చెల్లిన టైర్లతో వాహనాన్ని నడిపితే.. వారికి భారీ మొత్తంలో జరిమానా ఉంటుందని తెలిపారు. 500 దిన్హార్ల ఫైన్‌తోపాటు నాలుగు బ్లాక్ పాయింట్స్ ఇవ్వనున్నట్టు వివరించారు. 




Updated Date - 2022-07-17T17:03:49+05:30 IST