అబుధాబి ఎంట్రీ రూల్స్ మరింత కఠినం!

ABN , First Publish Date - 2021-01-17T14:07:46+05:30 IST

యూఏఈ రాజధాని అబుధాబి ఎంట్రీ రూల్స్‌ను మరింత కఠినతరం చేసింది.

అబుధాబి ఎంట్రీ రూల్స్ మరింత కఠినం!

అబుధాబి: యూఏఈ రాజధాని అబుధాబి ఎంట్రీ రూల్స్‌ను మరింత కఠినతరం చేసింది. ఇకపై అబుధాబిలో ప్రవేశించాలంటే 48 గంటల ముందు తీసుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. అలాగే దేశంలో ప్రవేశించిన అనంతరం 4 రోజుల తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడం కూడా తప్పనిసరి. ఈ నిబంధనలు దేశపౌరులు, నివాసితులతో పాటు అబుధాబిలో నివసించే వారికి కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. అయితే, నేషనల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా టీకా తీసుకున్నవారికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. 


దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం కూడా యూఏఈ వ్యాప్తంగా 3,432 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 249,808కు చేరితే.. మరణాల సంఖ్య 740కి చేరింది. ఇక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసిన యూఏఈ జనవరి 10 వరకు 2.50 లక్షల మందికి టీకా ఇవ్వడం పూర్తి చేసింది. 

Updated Date - 2021-01-17T14:07:46+05:30 IST