గ్రీన్‌లిస్ట్ దేశాల జాబితాను సవరించిన Abu Dhabi.. భారత్‌కు మళ్లీ నిరాశ..

ABN , First Publish Date - 2022-02-16T16:42:21+05:30 IST

యూఏఈ రాజధాని అబుదాబి తాజాగా మరోసారి గ్రీన్‌లిస్ట్ దేశాల జాబితాను సవరించింది.

గ్రీన్‌లిస్ట్ దేశాల జాబితాను సవరించిన Abu Dhabi.. భారత్‌కు మళ్లీ నిరాశ..

అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబి తాజాగా మరోసారి గ్రీన్‌లిస్ట్ దేశాల జాబితాను సవరించింది. ఈ జాబితాలో 72 దేశాలకు చోటు కల్పించింది. ఈ దేశాల నుంచి అబుధాబి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. అయితే, ఈ జాబితాలో భారత్‌ సహా పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకకు చోటు దక్కలేదు. ఇక గ్రీన్‌లిస్ట్‌లోని 72 దేశాల నుంచి వచ్చే ప్రణికులకు కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించింది. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరికైతే వ్యాక్సినేషన్ పూర్తైందో వారు అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే పీసీఆర్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి. అలాగే ఆరో రోజున కూడా మరోసారి పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఇక వ్యాక్సినేషన్ పూర్తికాని ప్రయాణికులు అరైవల్ సమయంలో పీసీఆర్ టెస్టు ఉంటుంది. దీంతో పాటు ఆరు, తొమ్మిదో రోజున రెండు కరోనా పరీక్షలు ఉంటాయి. ఈ నిబంధనలు మంగళవారం(ఫిబ్రవరి 15) నుంచే అమల్లోకి వచ్చాయి.


అబుధాబి సవరించిన గ్రీన్‌లిస్ట్‌లోని 72 దేశాలివే..  

  1. Albania
  2. Algeria
  3. Armenia
  4. Australia
  5. Austria
  6. Azerbaijan
  7. Bahrain
  8. Belarus
  9. Belgium
  10. Bosnia and Herzegovina
  11. Brazil
  12. Bulgaria
  13. Burma
  14. Cambodia
  15. Canada
  16. China
  17. Croatia
  18. Cyprus
  19. Czech Republic
  20. Denmark
  21. Finland
  22. France
  23. Georgia
  24. Germany
  25. Greece
  26. Hong Kong (SAR)
  27. Hungary
  28. Indonesia
  29. Iran
  30. Iraq
  31. Israel
  32. Italy
  33. Japan
  34. Kazakhstan
  35. Kuwait
  36. Kyrgyzstan
  37. Laos
  38. Latvia
  39. Luxembourg
  40. Malaysia
  41. Maldives
  42. Netherlands
  43. Morocco
  44. Norway
  45. Oman
  46. Papua New Guinea
  47. Philippines
  48. Poland
  49. Portugal
  50. Republic of Ireland
  51. Romania
  52. Saudi Arabia
  53. Serbia
  54. Singapore
  55. Slovakia
  56. Slovenia
  57. South Korea
  58. Spain
  59. Sweden
  60. Switzerland
  61. Syria
  62. Seychelles
  63. Taiwan, Province of China
  64. Tajikistan
  65. Thailand
  66. Tunisia
  67. Turkey
  68. Yemen
  69. Turkmenistan
  70. Ukraine
  71. United States of America
  72. Uzbekistan

Updated Date - 2022-02-16T16:42:21+05:30 IST