జగిత్యాల జిల్లాలో ఏబీవీపీ బంద్‌ విజయవంతం

ABN , First Publish Date - 2022-07-06T06:04:02+05:30 IST

రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్క రించాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు జగిత్యాల జిల్లాలో తలపెట్టిన బంద్‌ ప్రశాంతంగా విజయవంతమైంది.

జగిత్యాల జిల్లాలో ఏబీవీపీ బంద్‌ విజయవంతం
జగిత్యాలలో పాఠశాల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు

జగిత్యాల అర్బన్‌, జూలై 5: రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్క రించాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు జగిత్యాల జిల్లాలో తలపెట్టిన బంద్‌ ప్రశాంతంగా విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్‌ వ్యవస్థకు కొమ్ముకాసే విధంగా విద్యాశాఖ వ్యవహ రించ డం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించ డంతో పాటు, ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని పాఠశా లల్లో  మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.   

ఫ కోరుట్ల/కోరుట్ల రూరల్‌ : ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్‌  మంగళవారం విజయవంతమైంది. పట్టణంలోని వివిధ పభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలకు వద్ద చేరుకొని తరగతులను బహిస్కరించారు. ఈ సందర్బంగా  ఏబీవీపీ నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఉరు మన బడి’ కార్యక్రమానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నియమించాలని అన్నారు. అదే విధంగా మండలంలోని కల్లూర్‌ గ్రామంలో మోడల్‌, కస్తూర్భా పాఠశాలల వద్ద నిరసన తెలిపి అక్షర పాఠశాలలో తరగతులను బహిష్కరించారు. కార్యక్రమంలో ఎబివిపి నాయకులు బింగి రాహులు, మహదేవ్‌, దినేష్‌, తరుణ్‌ శివ, శ్రావన్‌లు పాల్గొన్నారు. 

ఫ కొడిమ్యాల : మండల కేంద్రంలోని విద్యా సంస్థలను అధిక ఫీజుల వసూలు చేస్తున్న విద్యా సంస్థల తీరును నిరసిస్తూ రాష్ట్ర ఏబీవీపీ పిలుపు మేర కు మంగళవారం విద్యా సంస్థలను మండల ఏబీవీపీ నాయకులు బందు చేయిం చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు బోగ రాకేష్‌, కంచర్ల మనోజ్‌, నరేష్‌, మున్నా, తిరుపతి, మల్లిఖార్జున్‌ అఖిల్‌, సాయి తదితరులు ఉన్నారు.

ఫ మెట్‌పెల్లి : ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన పాఠశాల బంద్‌ మెట్‌పెల్లిలో విజయవంతం అయింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ సమస్య లు పరిష్కరించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ‘ మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాహుల్‌, అమృత్‌, మహేంధ్ర, అరుణ్‌, సంజయ్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-07-06T06:04:02+05:30 IST