విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-06-29T04:37:42+05:30 IST

విద్యా రంగం సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం కాగజ్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తున్న టీఎస్‌టీయూఎఫ్‌ నాయకులు

- టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన

కాగజ్‌నగర్‌, జూన్‌ 28: విద్యా రంగం సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం కాగజ్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈసందర్భంగా టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వైద్య శాంతి కుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. 2020 జాతీయ విద్యావిదానంతో అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. నాణ్యమైన విద్య అందించాలంటే ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T04:37:42+05:30 IST