Acb Rides: కిటికీలో నుంచి బయటకు డబ్బు

ABN , First Publish Date - 2022-08-04T02:28:31+05:30 IST

సూళ్లూరుపేట (Sullurpeta) మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ (Acb) ఆకస్మికంగా తనిఖీలు చేసింది. మున్సిపల్ కార్యాలయంలో..

Acb Rides: కిటికీలో నుంచి బయటకు డబ్బు

నెల్లూరు (nellore): సూళ్లూరుపేట (Sullurpeta) మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ (Acb) ఆకస్మికంగా తనిఖీలు చేసింది. మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతకుముందు ఏసీబీ రాకను చూసిన మున్సిపల్ సిబ్బంది డబ్బులను కిటికీలో నుంచి లక్షా 13 వేల రూపాయలను బయటకు పడేశారు. వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల్లో లేని డబ్బును సీజ్ చేశారు. మున్సిపల్ సిబ్బందిని పరిశీలిస్తున్నారు. ఇటీవల సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. 




Updated Date - 2022-08-04T02:28:31+05:30 IST