గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2021-10-27T05:06:57+05:30 IST

జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్‌ జేసీ వెంకటేష్‌ ఆదేశించారు.

గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి
బీడీకాలనీలో గృహ నిర్మాణాల పురోగతిపై జేసీ వెంకటేష్‌ ఆరా

హౌసింగ్‌ జేసీ వెంకటేష్‌


తొట్టంబేడు, అక్టోబరు 26: జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్‌ జేసీ వెంకటేష్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని బీడీకాలనీ వద్ద ఉన్న జగనన్న కాలనీని పరిశీలించారు. గృహ నిర్మాణాలు నత్తనడకన సాగడంపై జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించగా, బిల్లుల మంజూరులో జాప్యంతో లబ్ధిదారులు ఆలస్యంగా పనులు చేపడుతున్నట్లు అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సకాలంలో బిల్లుల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందనీ, ఇకపై సమస్యలు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. అక్కడి నుంచి జేసీ తొట్టంబేడు సచివాలయాన్ని తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దారు పరమేశ్వరస్వామి, ఎంపీడీవో వెంకటసౌభాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T05:06:57+05:30 IST