పక్కాగృహ నిర్మాణాలు వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2022-05-26T06:45:36+05:30 IST

పక్కా గృహ ని ర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. బుధవారం పెద్దపంజాణి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన తనిఖీ చేశారు.

పక్కాగృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
లబ్ధిదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ హరినారాయణన్‌


పెద్దపంజాణి, మే 25: పక్కా గృహ ని ర్మాణాలను వేగవంతం చేయాలని  కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. బుధవారం పెద్దపంజాణి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన  తనిఖీ చేశారు. ప్రభుత్వ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. మండలంలో సచివాలయాలు, ఆర్బీకేల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం బట్టందొడ్డిలోని ఆర్బీకేలో రి కార్డులు పరిశీలించారు. ఆర్బీకే సిబ్బంది రైతు లకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.  మండలంలో జరుగుతున్న డ్రోన్‌ సర్వే వివ రాలను అడిగి తెలుసుకున్నారు. బట్టందొడ్డిలో హౌసింగ్‌ లేఅవుట్‌ను పరిశీలించారు. లబ్ధిదా రులు పనులు వేగవంతం చేయాలని అందుకు అవసరమైన సామగ్రిని సకాలంలో పంపిణీ చే యాలని ఆదేశించారు. అనంతరం అప్పినపల్లె సచివాలయాన్ని సందర్శించారు. తహసీల్దార్‌  హనుమంతు, ఎంపీడీవో శివరాజు, ఏవో రఖీబా, పీఏసీఎస్‌ చైర్మన్‌ శంకరప్ప పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T06:45:36+05:30 IST