మ్యుటేషన్‌ను వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2022-06-25T05:26:29+05:30 IST

రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆన్‌లైన్‌లో వ్యక్తుల భూ మార్పుల దిద్దుబాటుకు సంబంధించి మ్యుటేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అఽధికారులను ఆదేశించారు.

మ్యుటేషన్‌ను వేగవంతం చేయండి

తహసీల్దార్లను ఆదేశించిన కలెక్టర్‌ 


నంద్యాల టౌన్‌, జూన్‌ 24 : రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆన్‌లైన్‌లో వ్యక్తుల భూ మార్పుల దిద్దుబాటుకు సంబంధించి మ్యుటేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అఽధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ హాల్‌లో జేసీ నారపురెడ్డి మౌర్యతో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మ్యూటేషన్‌ తప్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు బియాండ్‌ సబ్‌ ఎస్‌ఎల్‌ఏకు వెళ్లకుండా నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రీ సర్వే, భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సూచిం చారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్‌ టైం సెటిల్‌ మెంట్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 4109 గృహాలకు రిజిస్ట్రేషన్‌, స్కానింగ్‌ తదితర పనులను పూర్తి చేయాలని ఆదేశిం చారు. స్పందన రెవెన్యూ సర్వీసుల క్లియరెన్స్‌కు సంబంఽ దించి 63 పెండింగ్‌లో ఉన్నాయని, బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏకు వెళ్లకుండా  ఫిర్యాదులను పరిష్కరించాలని అన్నారు. డీఆర్వో పుల్లయ్య, నంద్యాల, డోన్‌, ఆత్మకూరు ఆర్డీవోలు శ్రీనివాసులు, వెంకటరెడ్డి, దాసు, జిల్లాలోని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T05:26:29+05:30 IST