వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2021-08-03T05:28:52+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదేశించారు. సోమవారం సంతబొమ్మాళిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని సచివాలయాల్లో శతశాతం వ్యాక్సిన్‌ ప్రక్రియ సాగేలా అధికారులు రోజూ పర్యవేక్షణ చేయాలన్నారు.

వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయండి
సంతబొమ్మాళి సచివాలయంలో ఉద్యోగులను ప్రశ్నిస్తున్న కలెక్టర్‌


కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

సంతబొమ్మాళి, ఆగస్టు 2: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదేశించారు. సోమవారం సంతబొమ్మాళిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని సచివాలయాల్లో శతశాతం వ్యాక్సిన్‌ ప్రక్రియ సాగేలా అధికారులు రోజూ పర్యవేక్షణ చేయాలన్నారు. వేయాలన్నారు. సచివాలయాల నిర్మాణాలపై మండల ఇంజినీర్‌ రెడ్డి సత్యనారాయణను అడిగి తెలుసు కున్నారు. హౌసింగ్‌, వ్యవసాయశాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం సంతబొమ్మాళి సచివాలయాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో విశ్వేశ్వర రావు, తహసీల్దార్‌ ఆదిబాబు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.                                                 


శతశాతం లక్ష్యం పూర్తి చేయండి 

రావిచెంద్రి(ఎల్‌.ఎన్‌.పేట): కొవిడ్‌ వాక్సినేషన్‌ గ్రామాల్లో శత శాతం పూర్తి చేయాలని జేసీ శ్రీరాములునాయుడు అన్నారు. రావిచెంద్రి సచివాలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. 45 ఏళ్లు దాటిన వారికందరికీ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కె.రామారావు, తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ, ఎంపీడీవో కార్యా లయ సూపరింటెండెంట్‌  కేవీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

  

Updated Date - 2021-08-03T05:28:52+05:30 IST