ఖజానా శాఖ డీడీ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-07-05T07:21:54+05:30 IST

జిల్లా ఖజానా డిప్యూటీ డైరక్టర్‌గా ఎం.రామచంద్ర సోమవారం కలెక్టరేట్‌లోని ఖజానా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఖజానా శాఖ డీడీ బాధ్యతల స్వీకరణ
డీడీ రామచంద్రకు పుష్పగుచ్ఛం బహూకరిస్తున్న ఎస్టీవోలు, ఉద్యోగులు

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 4: జిల్లా ఖజానా డిప్యూటీ డైరక్టర్‌గా ఎం.రామచంద్ర సోమవారం కలెక్టరేట్‌లోని ఖజానా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆచనకు ప్రస్తుత డీడీ గంగాద్రి పుష్పగుచ్చం బహూకరించి స్వాగతం పలికారు. గంగాద్రిని నెల్లూరు జిల్లాకు, అక్కడ పనిచేస్తున్న రామచంద్రను చిత్తూరుజిల్లాకు ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన విషయం విధితమే. చిత్తూరు జిల్లా డీడీగా గంగాద్రి ఐదేళ్ళకు మించి పనిచేసారు. కాగా నూతన డీడీ రామచంద్రను ఏపీవో శ్రీనివాసులు, ఉద్యోగసంఘ నాయకులు, కార్యాలయ సిబ్బంది పలువురు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నూతన డీడీ ఏటీవో, ఎస్టీవోలకు సూచనలు అందజేశారు.


Updated Date - 2022-07-05T07:21:54+05:30 IST