డీఈవో బాధ్యతల స్వీకరణ

Sep 18 2021 @ 01:18AM
కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న డీఈవో మహ్మద్‌ అబ్దుల్‌ మునఫ్‌

సూర్యాపేట అర్బన్‌, సెప్టెంబరు 17 : పేట డీఈవోగా మహ్మద్‌ అబ్దుల్‌ మునఫ్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నల్లగొండ కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న అబ్ధుల్‌ మునఫ్‌ సూర్యాపేటకు డీఈవోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డిని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. 

Follow Us on: