ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

ABN , First Publish Date - 2020-12-04T04:40:53+05:30 IST

కడప-చెన్నై రహదారి రాజంపేట మండలం ఊటుకూరు గ్రామం వద్ద గురువారం ఓ ఇంట్లోకి లారీ దూసుకెళ్లింది.

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
ఊటుకూరులో ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

రాజంపేట టౌన్‌, డిసెంబరు 3 : కడప-చెన్నై రహదారి రాజంపేట మండలం ఊటుకూరు గ్రామం వద్ద గురువారం ఓ ఇంట్లోకి లారీ దూసుకెళ్లింది. అయితే పెనుప్రమాదం తప్పింది. పోలీసుల వివరాల మేరకు... లారీ ముందు వెళుతున్న కారు ఆకస్మికంగా ఆగడంతో ఆ కారును తప్పించబోయి అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లో ఉన్న వారు వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి తప్పించుకోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా హైవేపై అరగంట పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. మన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని పక్కకు తీయించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూశారు.  

Updated Date - 2020-12-04T04:40:53+05:30 IST