మార్టూరులో 132కేవీ సబ్‌స్టేషన్‌లో ప్రమాదం

ABN , First Publish Date - 2021-12-03T06:24:23+05:30 IST

మార్టూరు సమీపం లో అమరావతి నూలుమిల్లు పక్కన గల 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో గురువారం ఉదయం 11 గం టల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతులు చేస్తుండగా షాక్‌తో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యో గి అయిన వాచ్‌మన్‌ అరవీటి కోటేశ్వరరావు(43) మృతి చెందగా, ఏఈ సురేష్‌, సబ్‌ఇంజనీర్‌ జీవనాయక్‌, హెల్పర్‌ మీరావలిలకు గాయాలయ్యాయి.

మార్టూరులో 132కేవీ సబ్‌స్టేషన్‌లో ప్రమాదం
కోటేశ్వరరావు మృతదేహం

షాక్‌తో వాచ్‌మన్‌ మృతి

ముగ్గురు ఉద్యోగులకు గాయాలు


మార్టూరు, డిసెంబరు 2 : మార్టూరు సమీపం లో అమరావతి నూలుమిల్లు పక్కన గల 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో గురువారం ఉదయం 11 గం టల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతులు చేస్తుండగా షాక్‌తో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యో గి అయిన వాచ్‌మన్‌ అరవీటి కోటేశ్వరరావు(43) మృతి చెందగా, ఏఈ సురేష్‌, సబ్‌ఇంజనీర్‌ జీవనాయక్‌, హెల్పర్‌ మీరావలిలకు గాయాలయ్యాయి. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సబ్‌స్టేషన్‌లో ఉదయం పీటీఆర్‌ ఎల్‌సీ తీసుకొని ఏ బీ ఓపెన్‌ చేసి పనులు చేస్తుండగా ఇండక్షన్‌ విద్యుత్‌ ప్రసరించింది.  మరమ్మతులు చేస్తున్న హెల్పర్‌ మీరావలి, అతనికి సహకరిస్తున్న వాచ్‌మన్‌ కోటేశ్వరరావు, పనులు పర్యవేక్షిస్తున్న ఏఈ సురేష్‌, సబ్‌ ఇంజనీర్‌ జీవానాయక్‌లు షాక్‌కు గురయ్యారు. తీ వ్రంగా షాక్‌ కొట్టడంతో కోటేశ్వరరావు చేతికి, కాలికి గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కోటేశ్వరరావుతోపాటు గాయపడిన ముగ్గురిని ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి కోటేశ్వరరావు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. గాయపడిన ముగ్గురు ఉద్యోగులకు ప్రాథమిక చికి త్స అందించారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యా దు మేరకు ఎస్‌ఐ చౌడయ్య కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా డీఈలు బాలకేశవులు, రాజేంద్రప్రసాద్‌లు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి మృతి చెందిన కో టేశ్వరరావు, గాయపడిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. 


నేతాజీనగర్‌లో విషాదం


మృతిచెందిన కోటేశ్వరరావు నేతాజీనగర్‌లో ని వాసం ఉంటున్నారు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగేళ్ల క్రితం తండ్రి బాలయ్య కు రోడ్డు ప్రమాదంలో ఒక కాలు విరగగా, తల్లితండ్రులకు అతనే సహాయంగా ఉంటున్నారు. ఔట్‌ సో ర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న కోటేశ్వరరావుకు త్వర లో ఉద్యోగం పర్మినెంట్‌ చేస్తారని ఆశగా ఉన్నాడు. ఈ తరుణంలో అతను మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సం ఘటన కాలనీలో విషాదం నింపింది.


సాయం అందిస్తాం 


ప్రమాదం జరిగిన తీరుపై విచారణ చేస్తున్నా మని డీఈ పి.బాలకేశవులు తెలిపారు. మృతుని కు టుంబానికి ప్రభుత్వపరంగా రావాల్సిన సాయాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు. 


Updated Date - 2021-12-03T06:24:23+05:30 IST