నెల్లూరు: జిల్లాలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుత్తలూరు మండలం తెడ్డు పాడు పిల్లా పేరు వాగు సమీపంలో మంచు కారణంగా ఒకదానిని మరొకటి వరుసగా వాహనాలు ఢీకొన్నాయి. ఆగి ఉన్న లారీని ఢీ కొన్న ప్రైవేట్ బస్.. ప్రైవేట్ బస్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సును మరో లారీ ఢీ కొట్టింది. ప్రయాణికులు, డ్రైవర్లకి స్వల్ప గాయాలయ్యాయి.